అలాంటి పాత్ర‌లు చేయ‌నంటున్న నిత్యా

  • IndiaGlitz, [Wednesday,March 07 2018]

పాత్ర ఎటువంటిదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి.. ఆ పాత్రకే వన్నె తెచ్చే నటి నిత్య మీనన్. ఇటీవల నాని నిర్మాణంలో ఆమె నటించిన 'అ!' సినిమాలో.. లెస్బియన్ పాత్రకి ఎవరిని ఎంపిక చేయాలా అని దర్శకుడు తర్జనభర్జన పడుతూ ఉంటే.. నాని వెంటనే ఈ పాత్ర గురించి నిత్యకి చెప్పు, ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది అని చెప్పారంటే.. ఒక నిర్మాతగా నానికి ఆమె పై ఉన్న నమ్మకం ఏమిటో అర్ధమవుతుంది.

ఇలాగే ఎవరూ చేయలేని పాత్రల్ని నిత్యకి చెప్పి చేయించుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే.. 2016లో విడుదలైన మొదటి ఆఖరి చిత్రాలు '24', 'ఇరుమురుగన్' (తెలుగులో 'ఇంకొక‌డు'), 2017లో విడుదలైన 'మెర్సల్' (తెలుగులో 'అదిరింది'), ఇక ఇటీవల రిలీజ్ అయిన 'అ!' చిత్రాల్లో ఈమెవి చనిపోయే పాత్రలు కావడం గ‌మ‌నార్హం.

ప్రేక్షకుల్లో సానుభూతి అయితే ఈ పాత్రల‌కి వచ్చింది గానీ.. ఇక ఇటువంటి పాత్రలు చేయనని తేల్చి చెప్పేసింది ఈ మలబార్ భామ. "ఒకసారి ఇటువంటి పాత్రతో విజయం సాధిస్తే.. అటువంటి కథలే వస్తాయి.. ప్రేక్షకులు కూడా దానికే అలవాటు పడిపోతారు.. కొద్ది రోజులు ఇటువంటి పాత్రలకు గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నాను" అంటూ ఇటీవల ఇచ్చిన‌ ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పేసింది నిత్య.

More News

'ఆఫీసర్'కి ఓ ప్ల‌స్ పాయింట్ ఏంటంటే..

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆఫీసర్'. వర్మ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నాగార్జున పవర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో కనిపించనున్నారు.

మరో తమిళ సినిమా లో.. మంచు లక్ష్మి

మంచు లక్ష్మి మరో తమిళ సినిమా చేయబోతోంది. మంచి కథలకే నా ఓటు అని ముందు నుంచీ చెబుతోన్న లక్ష్మి అందుకు తగ్గట్టే కంటెంట్ ఉన్న కథలనే సెలెక్ట్ చేసుకుంటోంది. ప్రస్తుతం 'వైఫ్ ఆఫ్ రామ్' అనే ఓ కొత్తతరహా కథతో రాబోతోన్న లక్ష్మికి మరో మంచి ఆఫర్ వచ్చింది.

చిరంజీవి 'మగధీరుడు'కి 32 ఏళ్ళు

బంధాలు,బాంధవ్యాల విలువల్ని చెప్తూనే,అంతర్లీనంగా స్నేహం గొప్పతనాన్ని కూడా చాటి చెప్పిన చిత్రం 'మగధీరుడు'.

'ఎన్.జి.కె' టైటిల్ గురించి దర్శకుడు ఏమన్నారంటే..

తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా(సూర్య 36)తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

శర్వాకి చిరు సెంటిమెంట్ మరోసారి కలిసొచ్చేనా?

ఇప్పటి తెలుగు హీరోలకి 90వ దశకంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి పాటలను రీమిక్స్ చేయడం పరిపాటైపోయింది.