సరికొత్త జోన‌ర్‌లో నిత్యామీన‌న్ చిత్రం

  • IndiaGlitz, [Thursday,May 14 2020]

న‌టిగా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ నిత్యామీన‌న్. ఈ మ‌ల‌యాళ కుట్టి 2010లో అలా మొద‌లైంది చిత్రంతోతెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఆ త‌ర్వాత ఇష్క్, గుండెజారిగ‌ల్లంత‌య్యిందే స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించింది. అ! సినిమా త‌ర్వాత పూర్తిస్థాయి తెలుగు సినిమాలో నిత్యామీన‌న్ న‌టించ‌నే లేదు. గీత‌గోవిందం, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు వంటి చిత్రాల్లో అతిథి పాత్ర‌ల్లో మాత్ర‌మే మెరిసింది. ఆ త‌ర్వాత ఒక‌ట్రెండు సినిమాలు చేసినా అవి త‌మిళం, మ‌ల‌యాళంలోనే చేసింది.

అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు నిత్యామీన‌న్ మ‌రో డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీలో న‌టించ‌బోతుంద‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల మేర‌కు నిత్యామీన‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించని పొలిటిక‌ల్ థ్రిల్లర్ జోన‌ర్‌లో న‌టించ‌బోతుంద‌ని టాక్‌. హాలీవుడ్ చిత్రాల‌కు ప‌నిచేసిన ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ని అంటున్నారు. దాదాపు స్క్రిప్ట్ పూర్త‌యింద‌ని కూడా అంటున్నారు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌.

More News

ఎన్‌బీకే 107... వైవిధ్య‌మైన పాత్ర‌లో బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో త‌న 106వ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాక మునుపే ఆయ‌న త‌న 107వ సినిమాకు

పోర్న్ స్టార్‌తో వ‌ర్మ సినిమా...

క‌రోనా దెబ్బ‌కు సినీ ఇండ‌స్ట్రీ కుదేలైంది. సినిమా థియేట‌ర్స్ మూతప‌డ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయ‌నే దానిపై క్లారిటీ లేదు. అలాగే సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. ఇలాంటి త‌రుణంలో

మీరు చేసిన‌దాంతో పోల్చితే నేను చేసిందేమీ లేదు: శేఖ‌ర్ క‌మ్ముల‌

సెన్సిబుల్ సినిమాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో శేఖ‌ర్ క‌మ్ముల ఒక‌రు. ఆయ‌న తెర‌కెక్కించిన ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, లైప్ ఈజ్ బ్యూటీఫుల్ ఇలాంటి సినిమాలే ఆయ‌న స్టైల్ ఏంటో చెబుతాయి.

‘ఆత్మ నిర్భర్ భారత్’ అనే ఎందుకు.. ప్యాకేజీ ఉద్దేశమేంటి..!?

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా మీట్ నిర్వహించి నిశితంగా వివరాలు వెల్లడించారు.

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో ఈ 14 పాయింట్లే కీలకం..

భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు జాతినుద్ధేశించి మాట్లాడుతూ.. రూ.20 లక్షల కోట్లతో ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీని ప్రకటించిన విషయం విదితమే.