పుకార్లపై స్పందించిన నిత్య
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటిగా పేరు సంపాదించుకున్న నిత్యా మీనన్ రీసెంట్గా తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వ్యక్తిని పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేసింది. `ఫ్రెండ్, లవ్, హ్యాపీనెస్` అంటూ మెసేజ్ కూడా పెట్టడంతో చాలా మంది నిత్యామీనన్ ప్రేమలో పడిందంటూ అనుకున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి ఆమెకు కంగ్రాట్యులేషన్స్ కూడా చెప్పారు. కొందరు తెగ బాధపడిపోయారు.
అయితే అందరికీ నిత్యామీనన్ సోషల్ మీడియా ద్వారానే సమాధానం చెప్పేసింది. హాలీవుడ్ సినిమాల్లో దర్శకత్వ శాఖలో పనిచేసే ఆలీవర్ కాల్ హౌన్ అనే వ్యక్తితో తాను ఫోటో దిగానని.. తను క్లోజ్ ఫ్రెండే కాదు.. సోదరుడితో సమానం అంటూ వివరణ ఇచ్చేసింది. దీంతో నిత్యామీనన్ తనపై క్రియేట్ కాబోయే రూమర్స్‌కు చెక్ పెట్టేసింది.
Friends, love and happiness.. ??
— Nithya Menen (@MenenNithya) March 9, 2019
#OnenessUniversity #OandOacademy #OliverCalhoun pic.twitter.com/eJJs9wTKjD
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout