Nitish Kumar: బలపరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్.. ఆర్జేడీ కూటమికి భారీ షాక్..
Send us your feedback to audioarticles@vaarta.com
జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో నెగ్గారు. మొత్తం 243 స్థానాలు ఉన్న అసెంబ్లీలో.. నితీష్ ప్రభుత్వం కొనసాగాలంటే 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. అయితే విశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా ప్రభుత్వానికి మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అయితే ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయడం సంచలనంగా మారింది. దీంతో ఓటింగ్ సమయంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.
ఓటింగ్ ముందు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్ ఎన్నిసార్లు కూటమిని మారుస్తారంటూ ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేలను బెదిరించి వారి వైపు లాక్కొరని మండిపడ్డారు. నితీష్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. అనంతరం కాంగ్రెస్, ఆర్జేడీపై నితీష్‌కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి నుంచి తాను వైదొలగడానికి కాంగ్రెస్ నేతల వైఖరే కారణమన్నారు. విపక్షాలను ఏకం చేయడం కాంగ్రెస్ నేతలకు నచ్చలేదన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కూటమిలో తనకు వ్యతిరేకంగా పనిచేశారంటూ ఆరోపించారు. తాను ప్రారంభించిన కార్యక్రమాలను ఆర్జేడీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
అంతకుముందు ఆర్జేడీకి చెందిన అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరీపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ యాదవ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మద్దతుగా 125 మంది సభ్యులు ఓటు వేయగా.. వ్యతిరేకంగా 112 మంది ఓటు వేశారు. దీంతో ఆయన స్పీకర్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. కాగా ఇటీవల మహాఘట్‌బంధన్ నుంచి విడిపోయిన నితీశ్ కుమార్ బీజేపీతో జట్టుకట్టారు. అనంతరం రాజ్‌భవన్‌లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈనెల 12లోపు అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. దీంతో ఇవాళ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నితీష్‌కు మద్దతుగా మెజార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయడంతో విశ్వాస పరీక్షలో నెగ్గారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com