Nitish Kumar: బలపరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్.. ఆర్జేడీ కూటమికి భారీ షాక్..

  • IndiaGlitz, [Monday,February 12 2024]

జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ బీహార్‌ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో నెగ్గారు. మొత్తం 243 స్థానాలు ఉన్న అసెంబ్లీలో.. నితీష్ ప్రభుత్వం కొనసాగాలంటే 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. అయితే విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ సందర్భంగా ప్రభుత్వానికి మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అయితే ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయడం సంచలనంగా మారింది. దీంతో ఓటింగ్ సమయంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

ఓటింగ్‌ ముందు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్‌ ఎన్నిసార్లు కూటమిని మారుస్తారంటూ ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేలను బెదిరించి వారి వైపు లాక్కొరని మండిపడ్డారు. నితీష్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. అనంతరం కాంగ్రెస్‌, ఆర్జేడీపై నితీష్‌కుమార్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి నుంచి తాను వైదొలగడానికి కాంగ్రెస్‌ నేతల వైఖరే కారణమన్నారు. విపక్షాలను ఏకం చేయడం కాంగ్రెస్‌ నేతలకు నచ్చలేదన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కూటమిలో తనకు వ్యతిరేకంగా పనిచేశారంటూ ఆరోపించారు. తాను ప్రారంభించిన కార్యక్రమాలను ఆర్జేడీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

అంతకుముందు ఆర్జేడీకి చెందిన అసెంబ్లీ స్పీకర్‌ అవధ్ బిహారీ చౌధరీపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ యాదవ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మద్దతుగా 125 మంది సభ్యులు ఓటు వేయగా.. వ్యతిరేకంగా 112 మంది ఓటు వేశారు. దీంతో ఆయన స్పీకర్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. కాగా ఇటీవల మహాఘట్‌బంధన్‌ నుంచి విడిపోయిన నితీశ్ కుమార్ బీజేపీతో జట్టుకట్టారు. అనంతరం రాజ్‌భవన్‌లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈనెల 12లోపు అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. దీంతో ఇవాళ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నితీష్‌కు మద్దతుగా మెజార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయడంతో విశ్వాస పరీక్షలో నెగ్గారు.

More News

Mahi V Raghav: రాయ‌ల‌సీమ‌కు ఏమైనా చేశారా? ఇండస్ట్రీపై 'యాత్ర2' దర్శకుడు విమర్శలు..

ఏపీ సీఎం వైయస్ జగన్ జీవితంలో జరిగిన ఘటనల గురించి తెరకెక్కించిన 'యాత్ర-2' సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే ఈ చిత్రం దర్శకుడు మహి వి రాఘవ్ గురించి

AP DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్ చేశారు. 6,100 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

Revanth Reddy: కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు.. హరీష్‌ రావు కౌంటర్..

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Uttam Kumar Reddy: కృష్ణా నది జలాల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే ప్రసక్తే లేదు: ఉత్తమ్

సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. కృష్ణా నదీ జలాల ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదని జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

Harish Shankar: దుమ్మురేపుతోన్న 'ఈగల్' కలెక్షన్స్.. వారికి హరీశ్ శంకర్ కౌంటర్..

మాస్ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ మూవీ తొలి ఆట నుంచే హిట్ టాక్‌ తెచ్చుకుంది.