బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. NDAలో చేరేందుకు సిద్ధం..
Send us your feedback to audioarticles@vaarta.com
ఊహించిందే జరిగింది. లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అందరూ అనుకున్నట్లుగానే బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్‌కు తన రాజీనామా లేఖను సమర్పించార. అనంతరం మహాఘట్‌బంధన్‌తో తెగదెంపులు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని.. వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్‌ని కోరినట్లు నితీశ్ తెలిపారు. త్వరలోనే కొత్త కూటమిని ఏర్పాటుచేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
రాజీనామా చేసిన నితీశ్ కుమార్‌కి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. NDAలోకి మళ్లీ వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. రాజీనామా నిర్ణయం తీసుకున్నందుకు ఆయనను అభినందించారు. అలాగే బీజేపీ సీనియర్ నేతలు కూడా నితీశ్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. మరోవైపు ఇండియా కూటమి నేతలు మాత్రం నితీశ్ కుమార్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ ఇలా జరుగుతుందని తమకు ముందే తెలుసని తేల్చి చెప్పారు. ఆయా రామ్.. గయా రామ్ లాంటి వాళ్లు ఉంటారని ఎద్దేవా చేశారు. ఆయన ఇండియా కూటమిలో ఉండాలనుకుంటే కచ్చితంగా ఉండేవారని.. కానీ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు తాము మాత్రం ఏం చేయగలమని వ్యాఖ్యానించారు.
కాగా బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని RJDకి అత్యధికంగా 79 సీట్లు వచ్చాయి. బీజేపీకి 78 సీట్లు దక్కాయి. నితీశ్ కుమార్ జేడీయూ పార్టీకి 45 స్థానాలు వచ్చాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు ఏ పార్టీకి రాలేదు. దీంతో బీజేపీ,జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. అయితే కొన్ని సంవత్సరాలకే బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న నితీశ్ కుమార్ మహాఘట్‌బందన్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఇప్పుడు మళ్లీ ఆ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీకి మద్దతు తెలిపారు.
మొత్తమ్మీద 2013 నుంచి దాదాపు 5 సార్లు నితీశ్ కుమార్ ఓ కూటమి నుంచి మరో కూటమికి మారుతూ వచ్చారు. NDA,మహాఘట్బంధన్లోకి అటూ ఇటూ మారుతూనే ఉన్నారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో JDU,RJD, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడు కూడా నితీశ్‌నే ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో మహాఘట్బంధన్ నుంచి తప్పుకుని బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం పదవి చేపట్టారు. 2022లో బీజేపీకి గుడ్‌బై చెప్పి RJD,కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. దీంతో నిలకడలేని రాజకీయనాయకుడిగా..స్వార్థపూరిత నాయకుడిగా నితీశ్‌కు ముద్రపడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com