నితిన్ నెక్ట్స్ మూవీ ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో నితిన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన అ ఆ చిత్రం ఘన విజయం సాధించి నితిన్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అ ఆ ఇచ్చిన బిగ్ సక్సెస్ ను కంటిన్యూ చేసేలా మంచి ప్రాజెక్ట్ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసిన నితిన్ నెక్ట్స్ మూవీని అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడితో చేయనున్నారు.
ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. అసలు...హను రాఘవపూడి అఖిల్ తో సినిమా చేయాలి. కథ చెప్పడం అఖిల్ ఓకే అనడం కూడా జరిగిపోయింది కానీ...ఈ చిత్రాన్ని ఏ బ్యానర్ లో చేయాలి అనే విషయంలో ఇద్దరికి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు అదే కథతో నితిన్ తో మూవీ చేయనున్నాడు హను. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com