నితిన్ తదుపరి చిత్రం ఇదేనా..
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం అ..ఆ. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాథాకృష్ణ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్...ఇటీవల స్పీడున్నోడు సినిమా సెట్స్ లో సందడి చేసారు.
అయితే అఖిల్ సినిమా తర్వాత వీరిద్దరు ఇలా కలసి స్పీడున్నోడు సెట్స్ కి రావడం విశేషం. వినాయక్... చిరు 150వ సినిమా తర్వాత నితిన్ తో సినిమా చేయనున్నారని టాక్. అఖిల్ సినిమా వలన వచ్చిన నష్టాలను పూడ్చేందుకే నితిన్ తో వినాయక్ మూవీ ప్లాన్ చేస్తున్నారట నిర్మాత సుధాకర్ రెడ్డి. త్రివిక్రమ్ తో అ..ఆ సినిమా చేస్తున్న నితిన్ త్వరలో వినాయక్ తో సినిమా చేస్తే నితిన్ రేంజ్ మరింత పెరగడం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com