నితిన్ న్యూమూవీ డీటైల్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో నితిన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం అ..ఆ. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్నిజనవరికి పూర్తి చేసి ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత నితిన్ నటించే న్యూమూవీ ఫిక్స్ అయ్యింది. ఎమ్.వి.నారాయణ దర్శకత్వంలో సాయి తేజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్నినిర్మించనున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. వెలిగొండ శ్రీనివాస్ కథ అందిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ణ చైతన్య మాటలు అందిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందే ఈ చిత్రాన్ని జనవరిలో ప్రారంభించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments