నిత్యాకి ఎంతో స్పెషల్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్‌లైన్ కంటే పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ హీరోయిన్ అనే ట్యాగ్‌లైన్ కోసమే తపన పడే నాయిక నిత్యా మీనన్. కేరళ నుంచి దిగుమతి అయిన నిత్యా.. తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అయితే నిన్న మొన్నటివరకు స్టార్ హీరోల సినిమాల్లో నటించేందుకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వని ఈ అమ్మడు.. నెమ్మదిగా తన రూటుని మార్చుకుంటుందనిపిస్తోంది. గతేడాది విడుదలైన 'సన్నాఫ్ సత్యమూర్తి' కోసం తొలిసారి అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో సినిమాలో సందడి చేసిన నిత్యా.. ఈ ఏడాదిలో ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలతో తెరపై దర్శనమివ్వనుంది.
వీటిలో ఒకటి టాలీవుడ్ టాప్‌స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న 'జనతా గ్యారేజ్' కాగా.. మిగిలిన రెండు తెలుగులోకి అనువాద రూపంలో రానున్న తమిళ చిత్రాలు. వాటిలో ఒకటి సూర్య కథానాయకుడుగా నటిస్తున్న '24' కాగా.. మరొకటి విక్రమ్ హీరోగా నటిస్తున్న 'ఇరు ముగన్'. ఈ 3 చిత్రాలు ఈ సంవత్సరంలోనే విడుదల కానుండడంతో.. 2016 నిత్యా మీనన్ కి ఎంతో స్పెషల్ ఇయర్‌గా నిలవనుంది. పై మూడు చిత్రాలు సక్సెస్ బాటలో పయనిస్తే గనుక మరిన్ని స్టార్ హీరోల సినిమాలు ఆమె ఖాతాలో చేరతాయనడంలో అతిశయోక్తి లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com