జ‌య‌ల‌లిత పాత్ర‌లో నిత్యామీన‌న్‌

  • IndiaGlitz, [Sunday,September 23 2018]

త‌మిళ‌నాడు దివంగ‌త మహిళా ముఖ్య‌మంత్రి.. పురుట్చి త‌లైవి జ‌య‌లలిత జీవిత చ‌రిత్ర‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌నున్నారు. స‌మాచారం ప్ర‌కారం జ‌య‌ల‌లిత‌ పాత్ర‌లో నిత్యామీన‌న్ న‌టించ‌నుంది.

వివ‌రాల్లోకెళ్తే.. ఇప్ప‌టికే బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్‌తో ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ఇందుకూరి అమ్మ బ‌యోపిక్ రూపొందిస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా డైరెక్ట‌ర్ ప్రియ‌ద‌ర్శి అమ్మ బ‌యోపిక్ ది ఐర‌న్ లేడి పేరుతో తెర‌కెక్కించ‌నున్నారు.

ఈ పాత్ర‌లో వ‌రల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ నటిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్న సంద‌ర్భంలో నిత్యామీన‌న్ బోర్డ్‌పైకి వ‌చ్చింది. మిస్కిన్ అసోసియేట్ ప్రియ‌ద‌ర్శి ఈ బ‌యోపిక్‌ను తెర‌కెక్కిస్తున్నారు.