సమంతతో మరోసారి పంచుకుంటుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ఇష్క్`, మనం` చిత్రాల ఫేమ్ విక్రమ్ కె.కుమార్ గౌడ్ దర్శకత్వంలో 24` సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సూర్య తన హోమ్ బ్యానర్ 2Dఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాలో సూర్య సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో తొలిసారిగా సూర్య త్రిపాత్రాభినయం చేస్తున్నాడని, తాత, తండ్రి, కొడుకు పాత్రలతో సూర్య అలరించనున్నాడని ఫిలిం వర్గాల టాక్. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. అయితే రేపటి నుండి మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ కూడా ఈ చిత్రంలో జాయినవుతుందట. ఇటీవల సమంతతో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన నిత్యామీనన్ మరో చిత్రంలో కలిసి తెరను పంచుకోనుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com