వెంకీతో నిత్యా మీనన్ ?
Send us your feedback to audioarticles@vaarta.com
గురు తరువాత విక్టరీ వెంకటేష్ నటించబోయే కొత్త చిత్రానికి ముహుర్తం కుదిరిందన్న సంగతి తెలిసిందే. నేనే రాజు నేనే మంత్రి వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తరువాత సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. వెంకీ పుట్టినరోజున ఈ సినిమాని ప్రారంభించనున్నారు.
కాగా, ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మొదట అనుష్క పేరు వినిపించింది. ఆ తరువాత మెహరీన్ అన్నారు. తాజాగా కాజల్ అగర్వాల్ కన్‌ఫర్మ్ అయినట్టే అనే మాట కూడా వచ్చింది. అయితే.. వీళ్లెవరూ ఈ సినిమాలో నటించడం లేదని తెలిసింది.
తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం.. కేరళకుట్టి నిత్యా మీనన్ ఇందులో కథానాయికగా నటించే అవకాశముందని తెలిసింది. వాస్తవానికి అన్నీ కుదిరి ఉంటే.. కిషోర్ తిరుమల రూపొందించాల్సిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం కోసం వెంకటేష్ పక్కన నిత్యా నటించాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. మరి.. తేజ చిత్రంతోనైనా ఈ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com