హిందీలోకి నిత్యామీనన్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం నిత్యామీనన్ `ప్రాణ` అనే సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు. ఓ ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నిత్యామీనన్ రచయితగా కనపడబోతున్నారు. దర్శకుడు వి.కె.ప్రకాష్ రూపొందించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, భాషలతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. ఈ విషయాన్ని నిత్యామీనన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది.
నిత్యా హిందీలోకి ఈ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నారు. హిల్ స్టేషన్ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ మూవీలో ఒకే ఒక పాత్ర ఉంటుంది. ఈ ప్రయోగాత్మక చిత్రానికి.. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. “గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ జాజ్” లూయిస్ బ్యాంక్స్ సంగీతం అందిస్తున్నారు. పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం అందించిన ఈ మూవీ కేవలం 23 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments