నిత్యా..తెలుగువారికి మాత్రమే
- IndiaGlitz, [Saturday,April 09 2016]
కేరళ కుట్టి నిత్యా మీనన్ మంచి నటి మాత్రమే కాదు.. మంచి గాయని కూడా. నటిగా కంటే గాయనిగా రాణించాలన్నదే ఆమె కోరిక. అయితే హీరోయిన్ గానే ఎక్కువ అవకాశాలు వస్తుండడంతో అటు వైపే దృష్టి పెడుతున్నానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది నిత్యా. అలాంటి నిత్యాకి గాయనిగా ఓ మంచి అవకాశం దొరికింది. అదేమిటంటే.. ఏకంగా ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమన్ సంగీతంలో పాట పాడే అవకాశం.
తమిళ, తెలుగు భాషల్లో వేసవి కానుకగా విడుదల కానున్న '24' చిత్రం కోసం నిత్యా మీనన్ ఓ పాట పాడింది. అయితే ఆ పాట అచ్చంగా తెలుగు శ్రోతలకే దక్కడం గమనార్హం. చంద్రబోస్ సాహిత్యంలో 'లాలీజో' అంటూ సాగే పాటని తెలుగులో నిత్యా పాడింది. ఇదే పాటని తమిళ వెర్షన్లో శక్తిశ్రీ గోపాలన్ పాడింది. ఏదేమైనా నటిగానే కాకుండా గాయనిగానూ నిత్యాని ఇష్టపడే వారికి ఇది శుభవార్తే. ఇదివరకు రెహమన్ సంగీతమందించిన 'ఓకే బంగారం'లో నటించినా తెలుగు, తమిళ వెర్షన్ల కోసం నిత్యా ఒక్క పాట కూడా పాడకపోవడం ఇక్కడి కొసమెరుపు.