శర్వానంద్ సినిమా తప్పుకున్న నిత్యా?

  • IndiaGlitz, [Thursday,December 07 2017]

అలా మొదలైంది' సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్. ఇష్క్', గుండెజారి గల్లంతయ్యిందే', మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' సినిమాలతో న‌టిగా తానేంటో నిరూపించుకుంది ఈ కేర‌ళ‌కుట్టి.

అయితే.. ఆ త‌రువాత మాత్రం ఆమెకి తెలుగులో మంచి అవకాశాలు రాలేదనే చెప్పాలి. వచ్చిన ఆఫర్స్ కూడా సెకండ్ హీరోయిన్ గానే వస్తున్నాయి. సుధీర్ వర్మ డైరెక్షన్లో, శర్వానంద్ హీరోగా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ మూవీలో మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు శర్వానంద్. కాజల్ అగర్వాల్, నిత్య మీనన్ హీరోయిన్లు అని సినిమా ప్రారంభోత్స‌వం రోజు చెప్పారు. కాగా, ఇప్పుడు నిత్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. పారితోషికం విష‌యంలో స‌మ‌స్య వ‌ల్లే నిత్యా త‌ప్పుకుంద‌ని తెలిసింది. ఆమె పారితోషికం విషయమై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయ‌ట‌. ఆమె అడిగిన పారితోషికాన్ని నిర్మాతలు ఇవ్వలేకపోవడంతో ఈ సినిమా నుంచి నిత్య తప్పుకుంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు ఆమె స్థానంలో వేరే హీరోయిన్ కోసం వెతుకులాటకు సిద్ధమయ్యింది చిత్ర బృందం.

ప్రస్తుతం నాని నిర్మిస్తున్న అ!' సినిమాలో నిత్య ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

More News

స‌మంత‌.. డ‌బుల్ ధ‌మాకా

యువ క‌థానాయకుడు నాగ‌చైత‌న్య‌ని ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న స‌మంత‌.. మ‌ళ్లీ సినిమాల‌తో బిజీగా మారింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేస్తోంది.

హ‌లో.. ర‌మ్య‌కృష్ణ‌కి ఎంతో స్పెష‌ల్‌

ర‌మ్య‌కృష్ణ‌.. ఒక‌ప్పుడు గ్లామ‌ర్ హీరోయిన్‌. ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌. అయితే అప్పుడు.. ఇప్పుడు.. ఒక పాయింట్ మాత్రం కామ‌న్‌. అదేమిటంటే.. ఎలాంటి పాత్ర‌లోనైనా ఇట్టే ఒదిగిపోవ‌డం.

అను.. మెగా నామ సంవ‌త్స‌రం?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌.. ఇలా ఈ ముగ్గురు మెగా హీరోస్ తో జోడీక‌ట్టిన క‌థానాయిక‌లుగా త‌మ‌న్నా, శ్రుతి హాస‌న్‌, కాజ‌ల్‌, స‌మంత‌కి ప్ర‌త్యేక స్థానం ఉంది.

నేను అఖిల్ ని ఎలా చూడాలనుకున్నానో అలా 'హలో'లో చూశాను - నాగార్జున

యూత్ కింగ్అఖిల్ హీరోగా కళ్యాణి ప్రియదర్శిన్హీరోయిన్గా అన్నపూర్ణ స్టూడియోస్అండ్మనం ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో 'మనం' ఫేమ్విక్రమ్కె.కుమార్దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక్ యాక్షన్చిత్రం 'హలో'.

'ఆక్సిజన్' భవిష్యత్ తరాలు తప్పక చూడాల్సిన చిత్రం

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆక్సిజన్". గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మించారు.