close
Choose your channels

పోస్ట్ ప్రొడక్షన్లో నిత్య సినిమా

Sunday, December 24, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పేరుకి కేర‌ళ‌కుట్టి అయినా.. తెలుగువారికి అన‌తికాలంలోనే ద‌గ్గ‌రైంది నిత్యా మీన‌న్‌. అలా మొద‌లైందితో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ బొద్దుగుమ్మ‌.. ఆ త‌రువాత `ఇష్క్‌`, `గుండెజారి గ‌ల్లంత‌య్యిందే`, `మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు` త‌దిత‌ర చిత్రాల‌తో న‌టిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ప్ర‌స్తుతం `అ!` సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న నిత్యా.. మ‌రో వైపు ఓ మ‌ల్టీ లాంగ్వేజ్ చిత్రంలో న‌టించింది. ఆ సినిమానే `ప్రాణ‌`. తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ్‌, మ‌ల‌యాళం, ఆంగ్ల భాష‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్కింది.

ఇందులో నిత్యా.. పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న ర‌చ‌యిత పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆమె చేసిన పాత్ర‌ల‌కంటే భిన్నంగా, మిన్న‌గా ఈ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వి.కె.ప్ర‌కాష్ (కావ్యాస్ డైరీ ఫేమ్‌) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు పి.సి.శ్రీ‌రామ్ కెమెరామేన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో ఈ సినిమా విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.