పోస్ట్ ప్రొడక్షన్లో నిత్య సినిమా

  • IndiaGlitz, [Sunday,December 24 2017]

పేరుకి కేర‌ళ‌కుట్టి అయినా.. తెలుగువారికి అన‌తికాలంలోనే ద‌గ్గ‌రైంది నిత్యా మీన‌న్‌. అలా మొద‌లైందితో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ బొద్దుగుమ్మ‌.. ఆ త‌రువాత 'ఇష్క్‌', 'గుండెజారి గ‌ల్లంత‌య్యిందే', 'మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు' త‌దిత‌ర చిత్రాల‌తో న‌టిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ప్ర‌స్తుతం 'అ!' సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న నిత్యా.. మ‌రో వైపు ఓ మ‌ల్టీ లాంగ్వేజ్ చిత్రంలో న‌టించింది. ఆ సినిమానే 'ప్రాణ‌'. తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ్‌, మ‌ల‌యాళం, ఆంగ్ల భాష‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్కింది.

ఇందులో నిత్యా.. పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న ర‌చ‌యిత పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆమె చేసిన పాత్ర‌ల‌కంటే భిన్నంగా, మిన్న‌గా ఈ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వి.కె.ప్ర‌కాష్ (కావ్యాస్ డైరీ ఫేమ్‌) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు పి.సి.శ్రీ‌రామ్ కెమెరామేన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో ఈ సినిమా విడుద‌ల కానుంది.

More News

వాయిదా పడ్డ నాని చిత్రం

ఎం.సి.ఎతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు యువ కథానాయకుడు నాని.

'తొలి ప్రేమ' వాయిదా పడనుందా?

తొలిప్రేమ.. తెలుగు తెరపై సంచలనం సృష్టించిన ప్రేమకథా చిత్రమిది.

హీరోకి తల్లి పాత్రలో మీనా

తొలుత బాలనటిగా తెరంగేట్రం చేసి..తరువాత కాలంలో కథానాయికగానూ రాణించారు మీనా.

శ్రీను వైట్ల చిత్రంలో..

హాస్య నటుడిగా కెరీర్ ని ప్రారంభించి..క్రమంగా కథానాయకుడి పాత్రలవైపు అడుగులు వేశారు సునీల్.

'సప్తగిరి ఎల్.ఎల్.బి' చిత్రాన్ని వీక్షించిన పార్లమెంట్ సభ్యులు

'సప్తగిరి ఎక్స్ ప్రెస్'వంటి సూపర్హిట్ చిత్రం తర్వాత సప్తగిరి హీరోగా నటించిన చిత్రం 'సప్తగిరి ఎల్.ఎల్.బి'