నిత్యాకి బాగానే కలిసొస్తున్నట్టే..

  • IndiaGlitz, [Tuesday,November 14 2017]

అలా మొద‌లైంది చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కేర‌ళ‌కుట్టి నిత్యా మీన‌న్‌.. అన‌తికాలంలోనే మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే, మ‌ళ్ళి మ‌ళ్ళీ ఇది రాని రోజు చిత్రాల‌తో ఎలాంటి పాత్ర‌లైనా చేయ‌గ‌ల న‌టిగా పేరు తెచ్చుకున్న నిత్యా.. ఈ మ‌ధ్య సినిమాల సంఖ్య‌ని త‌గ్గించింది.

గ‌తేడాది విడుద‌లైన జ‌న‌తా గ్యారేజ్ త‌రువాత మ‌రో తెలుగు సినిమాకి సంతకం చేయ‌ని నిత్యా.. తాజాగా త‌మిళ అనువాద చిత్రం అదిరిందితో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఇక్క‌డ ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతంలో నిత్యా న‌టించిన ప్ర‌తిసారీ ఆమెకో విజ‌యం ద‌క్కుతోంది. అది కూడా ఏడాదికో సినిమా అన్న లెక్క‌న‌. 2015లో ఓకే బంగారంతో ఈ కాంబినేష‌న్ మొద‌లైంది. ఆ సినిమా హిట్ అయ్యింది. ఆ త‌రువాత 2016లో 24 చిత్రంతో ఈ కాంబినేష‌న్ మ‌రోసారి ప‌ల‌క‌రించింది. స‌క్సెస్ రిపీట్ చేసింది. ఇక 2017లో అదిరింది రూపంలో మ‌రో హిట్‌ని ఈ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్ సొంతం చేసుకుంది.

ఇవ‌న్నీ కూడా త‌మిళ అనువాద చిత్రాలే కావ‌డం గ‌మనార్హం. త‌మిళంలోనూ ఈ సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. మ‌రి 2018లోనూ ఈ కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుందేమో చూడాలి.

More News

బాలకృష్ణ కి పోటీగా రవితేజ?

నటసింహ బాలకృష్ణతో మాస్ మహారాజా రవితేజ మరోసారి పోటీపడనున్నాడా? అవుననే వినిపిస్తోంది టాలీవుడ్లో. కాస్త వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం బాలకృష్ణ జై సింహా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

నాగ చైతన్యకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ ?

అను ఇమ్మాన్యుయేల్.. అనతి కాలంలోనే అగ్ర కథానాయకుల పక్కన ఆఫర్లు సొంతం చేసుకుంటున్న క్రేజీ హీరోయిన్ పేరిది. నాని కథానాయకుడిగా నటించిన మజ్ను చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళకుట్టి..

తిరుగులేని సక్సెస్ తో దూసుకెళ్తోన్న 'పిఎస్ వి గరుడవేగ'

`పిఎస్వి గరుడవేగ 126.18 ఎం` సినిమా గురించి వినపడుతున్న వార్తలు. టీజర్ విడుదలైనప్పుడు మొదలైన సినిమా ప్రభంజనం ఇంకా కొనసాగుతుండటం విశేషం. సినిమా చూసిన ప్రేక్షకులే కాదు..

క‌లెక్ష‌న్స్‌తో దూసుకెళ్తోన్న గ‌రుడ‌వేగ‌...

క‌మ్ బ్యాక్ మూవీ ఆఫ్ డా.రాజ‌శేఖ‌ర్‌...సీట్ ఎడ్జ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌..సూప‌ర్బ్ స్క్రిప్ట్‌..

అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం

అక్కినేని కుటుంబానికి చెందిన ప్రముఖ స్టూడియో అన్నపూర్ణలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.