నిత్యాకి బాగానే కలిసొస్తున్నట్టే..
Send us your feedback to audioarticles@vaarta.com
అలా మొదలైంది చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కేరళకుట్టి నిత్యా మీనన్.. అనతికాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళి మళ్ళీ ఇది రాని రోజు చిత్రాలతో ఎలాంటి పాత్రలైనా చేయగల నటిగా పేరు తెచ్చుకున్న నిత్యా.. ఈ మధ్య సినిమాల సంఖ్యని తగ్గించింది.
గతేడాది విడుదలైన జనతా గ్యారేజ్ తరువాత మరో తెలుగు సినిమాకి సంతకం చేయని నిత్యా.. తాజాగా తమిళ అనువాద చిత్రం అదిరిందితో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఎ.ఆర్.రెహమాన్ సంగీతంలో నిత్యా నటించిన ప్రతిసారీ ఆమెకో విజయం దక్కుతోంది. అది కూడా ఏడాదికో సినిమా అన్న లెక్కన. 2015లో ఓకే బంగారంతో ఈ కాంబినేషన్ మొదలైంది. ఆ సినిమా హిట్ అయ్యింది. ఆ తరువాత 2016లో 24 చిత్రంతో ఈ కాంబినేషన్ మరోసారి పలకరించింది. సక్సెస్ రిపీట్ చేసింది. ఇక 2017లో అదిరింది రూపంలో మరో హిట్‌ని ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ సొంతం చేసుకుంది.
ఇవన్నీ కూడా తమిళ అనువాద చిత్రాలే కావడం గమనార్హం. తమిళంలోనూ ఈ సినిమాలు మంచి విజయం సాధించాయి. మరి 2018లోనూ ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com