ఆ ఇద్దరికీ నిత్యా మరోసారీ కలిసొస్తుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకరికేమో తెలుగు సినిమాల విషయంలో తను తొలిసారిగా కలిసొచ్చిన హీరోయిన్.. మరొకరికేమో ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసినా రీసెంట్ టైమ్స్‌లో సరైన విజయాలు లేనప్పుడు కలిసొచ్చిన లక్కీ గర్ల్. ఆ హీరోయిన్ నిత్యా మీనన్ కాగా.. ఆ దర్శకులు 'ఇష్క్, మనం' చిత్రాల ఫేం విక్రమ్ కుమార్ ఒకరు కాగా.. మరొకరు దిగ్గజ దర్శకుడు మణిరత్నం.
'ఇష్క్' వంటి హిట్ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నిత్యా మరోసారి హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్య హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం '24'లో ఆమె ఓ హీరోయిన్. సమంత మరో హీరోయిన్. ఇక 'ఓకే కన్మణి' (తెలుగులో ఓకే బంగారం) వంటి హిట్ తరువాత మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తదుపరి చిత్రంలోనూ నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటిసారి సదరు క్లాస్ డైరెక్టర్‌లిద్దరికీ బాగా కలిసొచ్చిన నిత్యా.. రెండోసారీ కలిసొస్తుందో లేదో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com