ఆ ఇద్ద‌రికీ నిత్యా మ‌రోసారీ క‌లిసొస్తుందా?

  • IndiaGlitz, [Tuesday,October 13 2015]

ఒక‌రికేమో తెలుగు సినిమాల విష‌యంలో త‌ను తొలిసారిగా క‌లిసొచ్చిన హీరోయిన్‌.. మ‌రొక‌రికేమో ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసినా రీసెంట్ టైమ్స్‌లో స‌రైన విజ‌యాలు లేన‌ప్పుడు క‌లిసొచ్చిన ల‌క్కీ గ‌ర్ల్‌. ఆ హీరోయిన్ నిత్యా మీన‌న్ కాగా.. ఆ ద‌ర్శ‌కులు 'ఇష్క్‌, మ‌నం' చిత్రాల ఫేం విక్ర‌మ్ కుమార్ ఒక‌రు కాగా.. మ‌రొక‌రు దిగ్గ‌జ ద‌ర్శకుడు మ‌ణిర‌త్నం.

'ఇష్క్' వంటి హిట్ త‌రువాత విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నిత్యా మ‌రోసారి హీరోయిన్‌గా న‌టిస్తోంది. సూర్య హీరోగా న‌టిస్తున్న త‌మిళ చిత్రం '24'లో ఆమె ఓ హీరోయిన్‌. స‌మంత మ‌రో హీరోయిన్‌. ఇక 'ఓకే క‌న్మ‌ణి' (తెలుగులో ఓకే బంగారం) వంటి హిట్ త‌రువాత మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న తదుప‌రి చిత్రంలోనూ నిత్యా మీన‌న్ హీరోయిన్‌గా న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మొద‌టిసారి స‌ద‌రు క్లాస్ డైరెక్ట‌ర్‌లిద్ద‌రికీ బాగా క‌లిసొచ్చిన నిత్యా.. రెండోసారీ క‌లిసొస్తుందో లేదో తెలియాలంటే వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

నందమూరి బాలకృష్ణ సరసన అక్ష

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా 'డిక్టేటర్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థతో కలిసి వేదాశ్వ క్రియేషన్స్ అసోసియేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు.

నిఖిల్ మ‌ళ్లీ టార్గెట్ చేశాడా?

'హ్యాపీడేస్' కోసం న‌లుగురు హీరోల్లో ఒక‌డిగా న‌టించి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టినా.. ఆ త‌రువాత 'యువ‌త‌'తో హిట్ కొట్టినా.. 'స్వామి రా..రా..'తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చినా.. హీరో నిఖిల్ కెరీర్ గ్రాఫ్‌ని మార్చింది మాత్రం 'కార్తీకేయ' సినిమానే.

మ‌ళ్లీ అలాగే వ‌స్తున్న అనుష్క‌

సినిమా వారికి సెంటిమెంట్స్ ఎక్కువ‌. ఓ సారి క‌లిసిరాని అంశంతోనే రెండోసారీ ఓ సినిమా తెర‌కెక్కుతుందంటేనే స‌ద‌రు చిత్రం ఫ‌లితంపై అనుమానాలు వ్య‌క్తం చేస్తారు.

విక్ర‌మ్‌తో పోటీప‌డుతున్న న‌య‌న‌తార‌

విక్ర‌మ్, న‌య‌న‌తార.. ఈ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సినిమా కూడా రాలేదు. గ‌తంలో వీరి క‌ల‌యిక‌లో సినిమా తీయాల‌ని త‌మిళ ఫిల్మ్‌మేక‌ర్స్ ప్ర‌య‌త్నించినా ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు.

మూడేళ్ల‌పాటు నంద‌మూరి హీరోల‌తో

గ‌తేడాది వ‌ర‌కు టాలీవుడ్‌లో ఆమెకు ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర ఉండేది. అయితే ఒకే ఒక్క సినిమా ఆమె జాత‌కాన్నే మార్చేసింది. ఆ త‌రువాత వ‌ద్ద‌న్నా అవ‌కాశాలు ఆమె కోసం వేచి చూస్తున్నాయి.