మళ్లీ బిజీ అవుతున్న నిత్యా
Send us your feedback to audioarticles@vaarta.com
నిత్యా మీనన్.. పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దక్షిణాది హీరోయిన్ పేరిది. సౌత్ లోని నాలుగు భాషల్లోనూ నటిగా తన ప్రతిభని చాటిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది.
అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళి మళ్ళీ ఇది రాని రోజు చిత్రాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న నిత్యా.. గతేడాది విడుదలైన జనతా గ్యారేజ్ తరువాత మళ్లీ తెలుగు చిత్రాలతో సందడి చేయలేదు.
ఈ మధ్య అదిరింది అనే తమిళ డబ్బింగ్ చిత్రంతో మరోసారి పలకరించిన నిత్యా.. ఇప్పుడు మళ్లీ తెలుగు చిత్రాలపై దృష్టి పెట్టింది. తన తొలి తెలుగు కథానాయకుడు నాని నిర్మిస్తున్న అ!లో ప్రధాన పాత్ర పోషించిన ఈ కేరళకుట్టి.. మరోసారి శర్వానంద్‌కి జోడీగా నటించేందుకు సిద్ధమైంది.
అలాగే వెంకటేష్ తో తేజ రూపొందించనున్న చిత్రంలోనూ నిత్యానే హీరోయిన్ గా నటించే అవకాశముందని టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద.. మళ్లీ టాలీవుడ్లో నిత్యా బిజీ కానుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments