నిన్న సమంత - నేడు నిత్యా
Wednesday, August 3, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్న సమంత - నేడు నిత్యా..! అసలు విషయం ఏమిటి అనుకుంటున్నారా..? సమంత, నిత్యామీనన్ ఇద్దరూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జనతా గ్యారేజ్ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
ప్రస్తుతం ఈ చిత్రం కోసం కేరళలో ఎన్టీఆర్, సమంత పై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. కేరళలోని షూటింగ్ స్పాట్ స్టిల్ ని నిన్న సమంత ట్విట్టర్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక నేడు నిత్యా ఎన్టీఆర్ పై సాంగ్ చిత్రీకరిస్తున్న షూటింగ్ స్పాట్ సెలయేరు పై ఉన్న వంతెన దగ్గర నవ్వుతూ ఓ ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని ఈనెల 12న శిల్పకళావేదికలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ చిత్రాన్నిప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments