నిత్యా మీనన్..ఎన్నాళ్లెన్నాళ్లకు..

  • IndiaGlitz, [Saturday,August 12 2017]

పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌ల్లోనే క‌నిపించ‌డానికి ఇష్ట‌ప‌డే క‌థానాయిక నిత్యా మీన‌న్‌. తొలి తెలుగు చిత్రం అలా మొద‌లైంది నుంచి చాలా వ‌ర‌కు అలాంటి పాత్ర‌ల్లోనే సంద‌డి చేసిందీ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌. ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు చిత్రాల‌లో త‌న న‌ట‌న‌తో క‌ట్టిప‌డేసి.. ఈ త‌రం సౌంద‌ర్య‌గా పేరు తెచ్చుకున్న నిత్యా.. గ‌తేడాది అయితే త‌న రూట్ మార్చుకున్న‌ట్లు క‌నిపించింది. ఎందుకంటే.. గ‌త సంవ‌త్స‌రం సూర్య‌, విక్ర‌మ్‌, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో అంత‌గా ప్రాధాన్యం లేని చిన్న చిన్న పాత్ర‌ల్లో క‌నిపించడ‌మే ఇందుకు కార‌ణం.
ఇలాంటి పాత్ర‌ల్లో నిత్యాని చూసి ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఆమె అభిమానుల వంతు అయింది. ఆమె తెలుగులో చివ‌రి సారిగా క‌నిపించింది జ‌న‌తా గ్యారేజ్‌లోనే. ఆ త‌రువాత విక్ర‌మ్ ఇంకొక్క‌డు సినిమా వారం రోజుల గ్యాప్‌తో వ‌చ్చింది. ఈ సినిమాల త‌రువాత నిత్యా మ‌ళ్లీ ఎక్క‌డా ద‌ర్శ‌న‌మివ్వ‌లేదు. ఈ గ్యాప్‌లో నివేదా థామ‌స్‌, సాయి ప‌ల్ల‌వి, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కీర్తి సురేష్ వంటి కేర‌ళ కుట్టిలు ఇక్క‌డి వారిని అల‌రించి.. నిత్యా లేని లోటుని తీర్చేశారు.
ఇలాంటి త‌రుణంలో... విజ‌య్ కొత్త చిత్రం మెర‌స‌ల్ (అదిరింది)లో ఓ చిన్న పాత్ర పోషిస్తున్న నిత్యా.. ఆ సినిమాలోని ఓ స్టిల్‌తో మ‌ళ్లీ వెలుగులోకి వ‌చ్చింది. ఈ చిత్రంలోనైనా నిత్యాది ప్రాధాన్యం ఉన్న పాత్రో.. లేక ఇలా క‌నిపించి అలా మాయ‌మ‌య్యే పాత్రో చూడాలి. ఏదేమైనా.. నిత్యా ఇక‌నైనా జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఆమె కోసం మంచి పాత్ర‌లు ఇట్టే పుడ‌తాయి.