బిహార్ ముఖ్యమంత్రి నితీష్ ప్రమాణ స్వీకారం..
Send us your feedback to audioarticles@vaarta.com
బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం.. ఇది వరుసగా నాలుగోసారి కాగా.. మొత్తంగా ఏడోసారి కావడం విశేషం. ఆయన చేత ముఖ్యమంత్రిగా బిహార్ గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. గత 15 ఏళ్లుగా బిహార్ ముఖ్యమంత్రి నితీషే కొనసాగుతున్నారు. ఈ సారి జేడీయూ-బీజేపీ కూటమి ఎన్నికల బరిలో దిగగా బీజేపీయే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. కానీ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జేడీయూకి ముఖ్యమంత్రి పదవిని అప్పజెప్పక తప్పలేదు.
కాగా.. నితీష్ ప్రమాణ స్వీకారం అనంతరమే ఉప ముఖ్యమంత్రులుగా బీజేపీకి చెందిన రేణు దేవి, థార్ కిషోర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరిలో శాసనసభాపక్ష నేతగా థార్ కిషోర్, శాసనసభాపక్ష ఉప నేతగా రేణు దేవి బీజేపీ ఎన్నుకుంది. కాగా.. బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 10న జరిగాయి. అతి కష్టం మీద జేడీయూ-బీజేపీ కూటమి అధికారాన్ని దక్కించుకుంది. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్లో ఎన్డీఏ 125 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే ఆర్జేడీ కూడా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవరించింది. కేవలం 12 వేల ఓట్లు మాత్రమే ఆర్జేడీని అధికారానికి దూరం చేయడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout