నితిన్ పెళ్లి ప్రీ పోన్ కానుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం కరోనా వల్ల ప్రజలు ఒకచోట చేయడానికి ఇబ్బందిగా మారింది. పదిమందికి పైగా ఎక్కడైనా గుమిగూడాలంటే ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు. అయితే అంతకు ముందే పెళ్లిళ్లు ఫిక్స్ చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు తమ పెళ్లిళ్లను కొంతకాలం వాయిదా వేసుకున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ ఇప్పట్లో తగ్గేలా లేదు. దీంతో కొందరు సెలబ్రిటీలు ప్రభుత్వ నియమాలు ఆధారంగానే పరిమితమైన కుటుంబ సభ్యుల మధ్య పెళ్లిళ్లు చేసుకున్నారు. నిర్మాత దిల్‌రాజు తన రెండో వివాహాన్ని తన కుటుంబ సభ్యుల మధ్యనే జరుపుకున్నారు. అలాగే హీరో నిఖిల్ కూడా పల్లవి వర్మను కూడా లాక్డౌన్ నిబంధనల మధ్యనే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే మిహీకతో రోకా వేడుకను జరుపుకున్న రానా కూడా ఆగస్ట్ 8న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక మిగిలింది నితిన్ వంతు. నితిన్ ఇంత వరకు తన పెళ్లి డేట్‌ను ఖరారు చేయనేలేదు. ఏప్రిల్ 16న జరగాల్సిన నితిన్ పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో డిసెంబర్లో నితిన్ పెళ్లి జరుగుతుందని వార్తలు వినిపించాయి. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఇప్పుడు నితిన్ పెళ్లి ప్రీ పోన్ కానుందని అంటున్నారు. జూలై లేదా ఆగస్ట్‌లో నితిన్, షాలిని పెళ్లి జరుగుతుందని అంటున్నారు. మరి ఈ వార్తలపై నితిన్, అతని కుటుంబ సభ్యులు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com