'రంగ్‌దే' షూటింగ్ స్టార్ట్..

  • IndiaGlitz, [Wednesday,September 23 2020]

‘భీష్మ’ మంచి సక్సెస్ సాధించిన అనంతరం అదే జోష్‌తో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘రంగ్‌దే’. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘గివ్ మీ సమ్ లవ్’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. వండర్ ఫుల్ లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం కేంద్రం షూటింగ్‌లకు పర్మిషన్ ఇవ్వడంతో ఈ సినిమా కూడా షూటింగ్ ప్రారంభించుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం కొన్ని పిక్స్ ద్వారా పంచుకుంది. ‘మేము మా ‘రంగ్‌దే’ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ నడుమ ప్రారంభించామని తెలియజేయడానికి ఆనందిస్తున్నాం.

ఈ సంక్రాంతికి మిమ్మల్ని కలుస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. నితిన్ తన వివాహానంతరం తొలిసారిగా షూటింగ్‌కు హాజరయ్యాడు. ప్రస్తుతం నితిన్‌కి సంబంధించిన సీన్స్‌ను తెరకెక్కిస్తున్నట్టు పిక్స్‌ను బట్టి తెలుస్తోంది. దాదాపు అన్ని సినిమాలూ.. విడుదల తేదీని డిసైడ్ చేసుకుని మరీ షూటింగ్ బరిలోకి దిగుతున్నాయి. ఏదీ ఏమైనా ఈ సంవత్సరంలో కోల్పోయిన సినిమాలన్నీ వచ్చే ఏడాదిలో డబుల్ బొనాంజాగా చూడొచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది మూవీ ఫెస్టివల్ నడవబోతోంది.

More News

ఆదిలోనే కొడాలిని కంట్రోల్‌లో పెట్టి ఉంటే..

అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు అంటారు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం జగన్ తమ పార్టీ నేతల విషయంలో పాటించలేదనేది పలువురి వాదన. ముఖ్యంగా మంత్రి కొడాలి నానిని ఆదిలోనే కంట్రోల్‌లో పెట్టి ఉండే

బిగ్‌బాస్: వార్ బిగిన్స్.. ఇక బీభత్సమే..

నేటి బిగ్‌బాస్ షో మొత్తం ఫిజికల్ టాస్క్‌తో నడిచింది. రోబోలు, మనుషుల మధ్య వార్ ఆసక్తికరంగా నడిచింది. పోయిన వారం సెల్ఫ్ నామినేట్ అవడంతో హోస్ట్ నాగార్జున ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు.

వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్..

వాట్సాప్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది. దీంతో వినియోగదారులకు అందుబాటులో ఉండేలా వాట్సాప్ కూడా సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

విశాల్‌కు హైకోర్టు నోటీసులు

హీరో, నిర్మాత అయిన విశాల్‌ దర్శకుడిగా మారి 'డిటెక్టివ్‌ 2' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

మల్టీపుల్‌ స్కెలోరోసిస్‌పై అవగాహన పెంచుతోన్న కీరవాణి

ప్రముఖ సంగీత దర్శుకుడు ఎం.ఎం.కీరవాణి కరోనా వారియర్స్‌గా కరోనా నుండి కోలుకున్న వారికి పిలుపునిచ్చారు.