క్రియేటివ్ డైరెక్టర్‌తో నితిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఛల్ మోహన్ రంగ సినిమా తర్వాత నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నితిన్. 2016లో `మనమంతా` సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చంద్రశేఖర్ ఏలేటి చెప్పిన లైన్ నచ్చడంతో నితిన్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ప్రస్తుతం చంద్రశేఖర్ ఏలేటి స్క్రిప్ట్ తయారు చేసే పనిలో బిజీగా ఉన్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరలో ఈ సినిమాను స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments