డిసెంబ‌ర్‌లో నితిన్ పెళ్లి..?

  • IndiaGlitz, [Saturday,May 16 2020]

ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల్ల లాక్‌డౌన్ ఏర్ప‌డించి జ‌నాలు ప‌దిమందికి పైగా ఎక్క‌డైనా గుమిగూడాలంటే ప్ర‌భుత్వాలు ఒప్పుకోవ‌డం లేదు. అయితే అంతకు ముందే పెళ్లిళ్లు ఫిక్స్ చేసుకున్న టాలీవుడ్ సెల‌బ్రిటీలు త‌మ పెళ్లిళ్ల‌ను కొంత‌కాలం వాయిదా వేసుకున్నారు. అయితే క‌రోనా ఎఫెక్ట్ ఇప్ప‌ట్లో త‌గ్గేలా లేదు. దీంతో కొంద‌రు సెల‌బ్రిటీలు ప్ర‌భుత్వ నియ‌మాలు ఆధారంగానే ప‌రిమిత‌మైన కుటుంబ స‌భ్యుల మ‌ధ్య పెళ్లిళ్లు చేసుకున్నారు. నిర్మాత దిల్‌రాజు త‌న రెండో వివాహాన్ని త‌న కుటుంబ స‌భ్యుల మ‌ధ్య‌నే జ‌రుపుకున్నారు. అలాగే హీరో నిఖిల్ కూడా ప‌ల్ల‌వి వ‌ర్మ‌ను కూడా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల మ‌ధ్య‌నే పెళ్లి చేసుకున్నారు.

నిజానికి నిఖిల్ త‌న పెళ్లిని ఓసారి వాయిదా వేసుకున్నాడు. మ‌రోసారి క‌రోనా ప్ర‌భావంతో లాక్‌డౌన్ ఎక్స్‌డెంట్ చేయ‌డంతో .. నెక్స్ట్ ముహుర్తానికి ఎక్కువ‌గా వేచి చూడటం భావ్యం కాద‌ని, మూఢం వ‌చ్చేస్తుంద‌ని భావించిన పెద్ద‌లు ఉన్న‌ట్లుండి నిఖిల్‌, ప‌ల్ల‌విల పెళ్లిజ‌రిపించేశారు. అయితే నిఖిల్ పెళ్లిరోజునే పెళ్లి చేసుకోవాల‌నుకున్న మ‌రో యువ హీరో నితిన్ మాత్రం లాక్‌డౌన్ స‌మ‌యంలో పెళ్లి చేసుకోవాల‌నుకోవ‌డం లేద‌ట‌. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు నితిన్ త‌న పెళ్లిని డిసెంబ‌ర్‌లో చేసుకోవాల‌నుకుంటున్నాడ‌ట‌. అప్ప‌టికి క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాతే నితిన్ పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాడ‌ట‌.

More News

అనుష్క 'నిశ్శబ్దం', 'ఉప్పెన‌' ఓటీటీలోనేనా ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు తెలుగు చిత్ర సీమ‌లో అనుష్క ఓ స‌మాధానంగా క‌న‌ప‌డుతుంది. ఇప్ప‌టికే ఈమె న‌టించిన అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి

అగ్ర నిర్మాణ సంస్థ సినిమాలో సమంత..?

అక్కినేని కోడ‌లుగా మారిన త‌ర్వాత స‌మంత రేంజ్ మ‌రో లెవ‌ల్‌లోకి వెళ్లింది. గ్లామ‌ర్ పాత్ర‌లు కంటే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లే వ‌స్తున్నాయి. అలాగే ఆమె సినిమాల‌ను ఎంచుకుంటుంది.

సితార కోసం మ‌హేశ్ పాట‌!!

క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల నెల‌కున్న లాక్‌డౌన్ కార‌ణంగా సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. అంద‌రూ కుటుంబ స‌భ్యుల‌తో వారి విలువైన స‌మ‌యాన్ని గడుపుతున్నారు.

కష్టకాలంలో మంచి మనసు చాటుకున్న 'స్టార్ మా'

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ నడుస్తు్న్న విషయం విదితమే. దీంతో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.

ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు.. 101 మంది డిశ్చార్జ్

ఆంధ్రప్రదేశ్‌ కరోనా థాటి నుంచి కాస్త కోలుకున్నట్లే అనిపిస్తోంది. మునుపటితో పోలిస్తే.. వారంరోజులుగా నమోదైన కేసులు చాలా కుదుటపడుతోందనే చెప్పుకోవచ్చు.