ప‌వ‌న్ హీరోయిన్ ని ట్రై చేస్తున్న నితిన్..!

  • IndiaGlitz, [Friday,November 04 2016]

యువ హీరో నితిన్ అ ఆ సినిమాతో భారీ విజ‌యాన్ని సాధించిన త‌ర్వాత నెక్ట్స్ మూవీ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. చాలా క‌థ‌లు విన్న‌ప్ప‌టికీ ఫైన‌ల్ గా అందాల రాక్ష‌సి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడితో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పాడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.

అయితే....ఈ చిత్రానికి మ‌రింత క్రేజ్ తెచ్చేందుకు ఈ మూవీలో స్టార్ హీరోయిన్ న‌టిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నార‌ట‌. ఆ స్టార్ హీరోయిన్ ఎవ‌రో కాదు ప్ర‌స్తుతం ప‌వ‌న్ తో కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తున్న శృతిహాస‌న్. ఆమెతో ఈ సినిమా విష‌య‌మై చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ట‌. అయితే ప్ర‌స్తుతం శృతిహాస‌న్ క‌మ‌ల్ శ‌భాష్ నాయుడు, ప‌వ‌న్ కాట‌మ‌రాయుడు, సూర్య‌ సింగం 3 చిత్రాల్లో న‌టిస్తుంది. వీటితో పాటు హిందీ చిత్రంలో కూడా న‌టిస్తుంది. అందుచేత డేట్స్ చూసి త‌న నిర్ణ‌యం చెబుతాను అన్న‌ద‌ట‌. మ‌రి...నితిన్ మూవీలో శృతి న‌టిస్తుందా..? లేదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!