నందినితో నితిన్....

  • IndiaGlitz, [Friday,May 13 2016]

అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే చిత్రాల సక్సెస్ తర్వాత నందినీ రెడ్డి తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని నితిన్ తో తెరకెక్కించాలని నందినీ రెడ్డి రీసెంట్ గా హీరో నితిన్ ను కలిసి లైన్ వినిపించిందట. నితిన్ కు కూడా లైన్ నచ్చడంతో బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయమని నందినీ రెడ్డిని కోరాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు కుదిరితే నందినీ రెడ్డి ఈసారి నితిన్ తో సినిమా చేయడం ఖాయమవుతుంది. రొమాంటిక్ కామెడి కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతుందట.