అనువాద సినిమాని విడుదల చేస్తున్నాడు...
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్..ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, అఖిల్ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అయ్యాడు. ఇప్పుడు అదే ట్రెండ్ ను కనపరిచేలా ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు నిర్మాతగా మరో అనువాద సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. వివరాల్లోకెళ్తే..సూర్య హీరోగా నటిస్తూ 2Dఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందిస్తోన్న చిత్రం 24`. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 13B`, ఇష్క్` తో పాటు ఇటీవల అక్కినేని మూడు తరాలతో మనం` వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాని తెరకెక్కించిన విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.
స్టార్టింగ్ డే నుండి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు అనువాద హక్కుల కోసం మంచి పోటీ కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో నితిన్ శ్రేష్ఠ్ మూవీస్, గ్లోబెల్ మూవీస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను తెలుగులో విడుదల చేస్తున్నారు. సూర్యకి తెలుగులో మంచి మార్కెట్ ఉన్న గత కొన్ని చిత్రాలు అనుకున్న స్థాయి విజయాలను అందుకోవడం లేదు. ఈ సమయంలో సూర్య 24`పై చాలా ఆశలనే పెట్టుకున్నాడనాలి.
సూర్యకి నితిన్ తోడు కావడంతో తెలుగులో ఈ సినిమా స్టార్ హీరోల రేంజ్ లో విడుదలవడం ఖాయంగా కనపడుతుంది. ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయం చేస్తుండగా, సమంత హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాని డిసెంబర్ విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజా సమచారం ప్రకారం రెహమాన్ మ్యూజిక్ కార్యక్రమాలను పూర్తి చేసేశాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments