అనువాద సినిమాని విడుదల చేస్తున్నాడు...

  • IndiaGlitz, [Wednesday,August 12 2015]

నితిన్..ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, అఖిల్ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అయ్యాడు. ఇప్పుడు అదే ట్రెండ్ ను కనపరిచేలా ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు నిర్మాతగా మరో అనువాద సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. వివరాల్లోకెళ్తే..సూర్య హీరోగా నటిస్తూ 2Dఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందిస్తోన్న చిత్రం 24'. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 13B', ఇష్క్' తో పాటు ఇటీవల అక్కినేని మూడు తరాలతో మనం' వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాని తెరకెక్కించిన విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.

స్టార్టింగ్ డే నుండి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు అనువాద హక్కుల కోసం మంచి పోటీ కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో నితిన్ శ్రేష్ఠ్ మూవీస్, గ్లోబెల్ మూవీస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను తెలుగులో విడుదల చేస్తున్నారు. సూర్యకి తెలుగులో మంచి మార్కెట్ ఉన్న గత కొన్ని చిత్రాలు అనుకున్న స్థాయి విజయాలను అందుకోవడం లేదు. ఈ సమయంలో సూర్య 24'పై చాలా ఆశలనే పెట్టుకున్నాడనాలి.

సూర్యకి నితిన్ తోడు కావడంతో తెలుగులో ఈ సినిమా స్టార్ హీరోల రేంజ్ లో విడుదలవడం ఖాయంగా కనపడుతుంది. ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయం చేస్తుండగా, సమంత హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాని డిసెంబర్ విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజా సమచారం ప్రకారం రెహమాన్ మ్యూజిక్ కార్యక్రమాలను పూర్తి చేసేశాడట.

More News

'సినిమా చూపిస్త మావ' శాటిలైట్ హక్కులు వీరివే..

‘ఉయ్యాల జంపాల’ జంట రాజ్‌తరుణ్‌-అవికాగోర్‌ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదలవుతుంది.

చిలుకూరి బాలాజీ తొలి కాపీ సిద్దం

అల్లాణి శ్రీ‌ధ‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ టివితో క‌లిసి ఫిల్మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌వేట్ లిమిటెడ్ ప‌తాకంపై రూపుదిద్దుకుంటున్న చిలుకూరి బాలాజీ

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'అప్పుడలా ఇప్పుడిలా'

సూర్యతేజ, హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’.

విజయదశమి కానుకగా అఖిల్ సందడి

మహానటుడు అక్కినేని మనవడు, కింగ్‌ నాగార్జున తనయుడు అఖిల్‌ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ

మహేష్ మళ్లీ చేస్తాడా

గుణా టీమ్ వర్స్ బ్యానర్ పై దర్శక నిర్మాత గుణశేఖర్ ‘రుద్రమదేవి’ పేరుతో తొలి హిస్టారికల్ త్రీడీ మూవీ నిర్మించాడు.