మ‌రోసారి ఆమెతోనే జోడీ క‌డుతున్న నితిన్‌

  • IndiaGlitz, [Tuesday,May 05 2020]

యువ క‌థానాయ‌కుడు నితిన్ చాలా గ్యాప్ తీసుకుని భీష్మ సినిమా చేశాడు. ఈ సినిమా ఈ ఏడాది విడుద‌లై మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా త‌ర్వాత నితిన్‌కు నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అందులో ముందుగా విడుద‌ల కావాల్సింది రంగ్‌దే సినిమా. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో నితిన్ జోడీగా మ‌హాన‌టితో జాతీయ అవార్డు అందుకున్న హీరోయిన్ కీర్తిసురేష్ న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. అదే స‌మ‌యంలో క‌రోనా రావ‌డంతో సినిమా షూటింగ్ ఆగింది.

క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌గానే నితిన్ రంగ్‌దే సినిమాను పూర్తి చేసి త‌దుప‌రి సినిమాల‌పై ఫోక‌స్ పెట్ట‌బోతున్నాడు. నితిన్ వ‌రుస‌లో ఉన్న సినిమాల్లో కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయే ప‌వ‌ర్ పేట సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా రెండు భాగాలుగా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకోవాల‌ని పెద్ద చ‌ర్చే జ‌రిగింది. చివ‌ర‌కు కీర్తిసురేష్‌నే ఎంపిక చేశార‌ని టాక్ విన‌ప‌డుతోంది. నితిన్ చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి సినిమా, అంధాదున్ రీమేక్ త‌ర్వాతే ప‌వ‌ర్ పేట సినిమాను తెర‌కెక్కించే అవ‌కాశాలున్నాయి.