రామ్ డైరెక్టర్ తో నితిన్ సినిమా..

  • IndiaGlitz, [Saturday,February 06 2016]
రామ్ డైరెక్ట‌ర్ తో నితిన్ సినిమా..చేస్తున్నాడు. ఇంత‌కీ రామ్ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? నేను...శైల‌జ సినిమాతో రామ్ కి హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమ‌ల‌. నేను...శైల‌జ సినిమా త‌ర్వాత డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల‌కి చాలా ఆఫ‌ర్స్ వ‌చ్చిన‌ప్ప‌టికీ...నితిన్ తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. నేను...శైల‌జ హిట్ త‌ర్వాత రామ్ మ‌రో సినిమా కిషోర్ తో చేయాల‌నుకున్నాడు.
కానీ...కిషోర్ ఇటీవ‌ల నితిన్ కి ఓ లైన్ వినిపించాడ‌ట‌. అది నితిన్ కి బాగా న‌చ్చ‌డంతో కిషోర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఈ విష‌యాన్ని హీరో నితిన్ తెలియ‌చేసాడు. నేను శైల‌జ డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల డైరెక్ష‌న్ లో నా నెక్ట్స్ మూవీ ఉంటుంది. అదీ మా సొంత సంస్థ శ్రేష్ట మూవీస్ బ్యాన‌ర్ లో ఉంటుంది. పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లో తెలియ‌చేస్తాను అంటూ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేసాడు. నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం అ ఆ ఏప్రిల్ 22న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా త‌ర్వాత నితిన్ కిషోర్ తిరుమ‌ల డైరెక్ష‌న్ లో మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది.