జ‌న‌తా గ్యారేజ్ లో నితిన్..

  • IndiaGlitz, [Friday,June 10 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న‌తాజా చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్నికొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోలో ఎన్టీఆర్, స‌మంత ల‌పై ఓ పాట చిత్రీక‌రిస్తున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...జ‌న‌తా గ్యారేజ్ లో నితిన్ అన‌గానే ఈ చిత్రంలో నితిన్ న‌టిస్తున్నాడు అనుకుంటే పొర‌పాటే. మ‌రి మేట‌ర్ ఏమిటంటే...జ‌న‌తా గ్యారేజ్ సెట్ కి వెళ్లి ఎన్టీఆర్ ని క‌లిసాడ‌ట నితిన్. ఈ విష‌యాన్ని నితిన్ ట్విట్టర్ ద్వారా తెలియ‌చేస్తూ...చాలా రోజుల త‌ర్వాత ఎన్టీఆర్ ని జ‌న‌తా గ్యారేజ్ సెట్ కి వెళ్లి క‌లిసాను. ఎన్టీఆర్ డ్యాన్స్ చూడ‌డం ఆనందంగా ఉంది అంటూ త‌న‌ సంతోషం వ్య‌క్తం చేసాడు నితిన్. అది సంగ‌తి.