కొత్త సినిమాను షురూ చేసిన నితిన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన భీష్మతో సూపర్ హిట్ కొట్టిన నితిన్ అంతకు ముందు దాదాపు ఏడాదికి పైగానే గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే భీష్మ తర్వాత ఏకంగా మూడు సినిమాలను అనౌన్స్ చేసి స్టార్ట్ కూడా చేసేశాడు. అంతా సవ్యంగా వెళుతుందనుకుంటున్న సమయంలో కరోనా వైరస్ ప్రభావం ప్రారంభం కావడంతో అన్నీ సినిమాల షూటింగ్స్ ఆరేడు నెలల పాటు ఆగాయి. నితిన్ సినిమాల విషయానికి వస్తే నితిన్, కీర్తిసురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'రంగ్ దే' చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. అలాగే మరోవైపు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్, రకుల్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరో హీరోయిన్లుగా చేస్తున్న సినిమా చెక్.. ఇది ఎనబై శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
ఈ రెండు సినిమాలను పూర్తి చేయకుండా నితిన్ తన కొత్త సినిమాను దుబాయ్‌లో స్టార్ట్ చేశాడు. బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ అంధాదున్, తెలుగు రీమేక్ షూటింగ్‌ను నితిన్ దుబాయ్‌లో స్టార్ట్ చేశాడు. ఈ విషయాన్ని నితిన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు. ఇందులో తమన్నా, నభానటేశ్ నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక్కడే నితిన్ తన రంగ్ దే సినిమా మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేయాలని అనుకుంటున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com