ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కనున్న నితిన్, షాలిని జంట.. డేట్ ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది. ఈ నెలలోనే నితిని, షాలినిల జంట పెళ్లి పీటలెక్కనుంది. ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. కరోనా కారణంగా వివాహాన్ని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. కరోనా తగ్గిన తరువాత చేసుకుందామనుకుంటే ఇప్పట్లో తగ్గే సూచనలైతే కనిపించడం లేదు. దీంతో ఈ జంట ఈ నెలలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకుంది. ఈ నెల 26న రాత్రి 8:30 గంటలకు.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ వివాహం జరగనుంది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే.. ‘రంగ్ దే’, ‘అంధాధున్ రీమేక్’, ‘పవర్ పేట’, ‘చెక్’ సినిమాల ద్వారా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments