నితిన్ నిశ్చితార్థ వేడుక
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నితిన్ ఈ నెల 26న తన నిచ్చెలి షాలినిని పెళ్లి చేసుకోబోతున్నారు. బుధవారం నితిన్ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని నితిన్ ఇంట్లో జరిగింది. పరిమిత సంఖ్యలో ఇరు కుటుంబాల పెద్దలు ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు. నితిన్ తనకు, షాలిని ఎంగేజ్మెంట్ జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ షాలినికి రింగు తొడుగుతున్న ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో నితిన్‌కు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. నితిన్ పెళ్లి ఫలక్నామా ప్యాలెస్‌లో జరగనుంది. అందుకు తగిన ఏర్పాటు రెండు కుటుంబాల నుండి చకచకా జరుగుతున్నాయి.
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రజలు ఒకచోట చేయడానికి ఇబ్బందిగా మారింది. దీంతో ప్రభుత్వం కొన్ని విధివిధానాలతో ఉత్సవాలను జరుపుకోవచ్చునని తెలిపిన సంగతి తెలిసిందే. ఈసమయంలో పెళ్లిళ్లు ఫిక్స్ చేసుకున్న సెలబ్రిటీలు ప్రభుత్వ నిబంధనల మేరకు పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. ఆ కోవలో సినీ నిర్మాత దిల్‌రాజు తన రెండో వివాహాన్ని తన కుటుంబ సభ్యుల మధ్యనే జరుపుకున్నారు. అలాగే హీరో నిఖిల్ కూడా పల్లవి వర్మను కూడా లాక్డౌన్ నిబంధనల మధ్యనే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవలే మిహీకతో రోకా వేడుకను జరుపుకున్న రానా కూడా ఆగస్ట్ 8న పెళ్లి చేసుకోబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout