తమిళ రీమేక్ ప్లాన్ లో నితిన్

  • IndiaGlitz, [Saturday,December 19 2015]

త‌మిళ రీమేక్ ప్లాన్ లో ఉన్న యువ హీరో...ఎవ‌రో కాదు క్యూట్ హీరో నితిన్. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ అ ఆ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్నిహారిక అండ్ హ‌సిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాథాక్రిష్ణ నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...త‌మిళ్ లో విజ‌యం సాధించిన యెట్టి చిత్రాన్నిర‌వి అర‌సు తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ తో రీమేక్ చేయ‌డానికి డైరెక్ట‌ర్ ర‌వి అర‌సు ట్రై చేస్తున్నారు. హిందీలో షాహిద్ క‌పూర్, క‌న్న‌డ‌లో య‌శ్ తో తెర‌కెక్కించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి..యెట్టి రీమేక్ కి నితిన్ సై అంటాడా..? నై అంటాడా అనేది చూడాలి.

More News

అభిమానులకు పవన్ కానుక....

పవర్ స్టార్ పవన్కళ్యాణ్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. సినిమాను స్మమ్మర్ లో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది.

రాజస్ధాన్ లో తేజు, రాశి..

రాజస్ధాన్ లో తేజు, రాశి ఖన్నా... ఏం చేస్తున్నారనుకుంటున్నారా..? సుప్రీమ్ సినిమా కోసం సాంగ్ షూట్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ రావివూడి తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విక్రమ్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ మారింది....

చియాన్ విక్రమ్ హీరోగా మర్మ మణిదన్ అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ముందు నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తారని వార్తలు వినపడ్డాయి.

'జత కలిసే' సెన్సార్ పూర్తి

అశ్విన్, తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మించిన చిత్రం ‘జత కలిసే’. ‘అలామొదలైంది’ ఫేమ్ స్నిగ్ధ ఓ ప్రధానపాత్రలో నటించింది.

'మామ మంచు.. .అల్లుడు కంచు' సెన్సార్ పూర్తి

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రమ్యక ష్ణ, మీనా, అల్లరి నరేష్, పూర్ణ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'మామ మంచు.. అల్లుడు కంచు డా.మోహన్బాబు, రమ్యక ష్ణ, మీనా కాంబినేషన్లో 23 ఏళ్ళ క్రితం మోహన్బాబు...