వచ్చే ఏడాది రూట్ మారుస్తున్న నితిన్
Send us your feedback to audioarticles@vaarta.com
గత మూడేళ్లుగా ఏడాదికో సినిమాతో పలకరిస్తూ ఉన్నాడు యువ కథానాయకుడు నితిన్. 2015లో కొరియర్ బోయ్ కళ్యాణ్ తో పలకరించిన నితిన్.. గతేడాది సంచలన విజయం సాధించిన అఆతో పలకరించారు. ఇక ఈ సంవత్సరం లైతో సందడి చేశారు.
అయితే వచ్చే ఏడాది మాత్రం రెండు సినిమాలతో పలకరించేందుకు నితిన్ ప్లాన్ చేసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తన 25వ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వంలో చేస్తున్నాడు నితిన్. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తోంది.
వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం తరువాత దిల్ రాజు నిర్మించనున్న శ్రీనివాస కళ్యాణంలో నటించేందుకు నితిన్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శతమానం భవతితో ఘనవిజయం అందుకున్న సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సందడి చేసే అవకాశముంది.
అంటే.. నితిన్ వచ్చే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com