'చదరంగం' ఆడబోతున్న నితిన్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నితిన్... ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. `ఛలో` ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో `భీష్మ`, `తొలిప్రేమ` ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో `రంగ్ దే`... అలాగే సీనియర్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి రూపకల్పనలో మరో చిత్రం చేస్తున్నాడు. వీటిలో `భీష్మ` ఇప్పటికే చిత్రీకరణ దశలో ఉండగా... క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ద్వితీయార్ధంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక `రంగ్ దే` విషయానికి వస్తే... దసరా సందర్భంగా లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ 2020 వేసవిలో తెరపైకి రాబోతోంది.
ఈ రెండు సినిమాల మధ్యలోనే... చంద్రశేఖర్ యేలేటి - నితిన్ కాంబినేషన్ ఫిల్మ్ వస్తుందని టాక్. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరుపుకున్న ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌కి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది. అదే.. `చదరంగం`. తాజా కథనాల ప్రకారం... సినిమాలో కథానాయకుడు చదరంగ క్రీడాకారుడు కావడంతో... టైటిల్‌ని కూడా `చదరంగం`గా ఫిక్స్ చేశారని తెలిసింది. త్వరలోనే ఈ టైటిల్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుంది.
భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్‌కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ నాయికలుగా నటిస్తున్నారు.
`అ ఆ` తరువాత సరైన విజయాలు లేని నితిన్.. `భీష్మ`, `చదరంగం`, `రంగ్ దే`తోనైనా ట్రాక్‌లోకి వస్తాడేమో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments