నితిన్ నెక్ట్స్ మూవీ ఆలస్యానికి కారణం ఇదే..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో నితిన్ నటించిన అ ఆ చిత్రం 50 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓవర్ సీస్ లో 2 మిలియన్ ను క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొంతమంది స్టార్ హీరోలకు 1 మిలియన్ క్రాస్ చేయడమే కష్టంగా ఉంటే..నితిన్ ఏకంగా 2 మిలియన్ క్రాస్ చేసేసాడు. అయితే...ఇప్పుడు అ ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకునేందుకు నితిన్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందుకే ఏదో ఒక సినిమా చేసేయకుండా తన రేంజ్ ను మరెంత పెంచే కథ కోసం, డైరెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడట.
తన కెరీర్ లో మరచిపోలేని చిత్రం గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాన్ని అందించిన విజయ్ కుమార్ కొండ నితిన్ కి గుండెజారి గల్లంతయ్యిందే చిత్రానికి సీక్వెల్ స్టోరీ వినిపించాడు. అయితే కథ విని నితిన్... ఫస్టాఫ్ బాగుంది సెకండాఫ్ ఇంకా బాగుండేలా రెడీ చేయమన్నాడట. సెకండాఫ్ సంతృప్తికరంగా వస్తే...ఈ మూవీ త్వరలో స్టార్ట్ అవుతుంది. మరో వైపు ఓ యువ దర్శకుడు కూడా నితిన్ తో సినిమా చేయడానికి కథ రెడీ చేస్తున్నాడు. ఇద్దరిలో ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనేది త్వరలో తెలుస్తుంది. మొత్తానికి... నితిన్ అ ఆ ఇచ్చిన రేంజ్ ను నిలబెట్టే కథ కోసం, దర్శకుడు కోసం వెయిట్ చేస్తూ...ఆలస్యం అయినా అదిరిపోయే కథతో వస్తాను అంటున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments