నైజాం కుర్రాడి తర్వాతి కాంబినేషన్ అదేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్ చేతినిండా సినిమాలే. జయాపజయాలతో సంబంధం లేకుండా.. వరుసగా సినిమాలు చేయడంలో ఈ నైజాం బుల్లోడు ఎప్పుడూ ముందుంటాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నుంచి సంచలన దర్శకుడు ఆర్జీవీ వరకు ఎందరితోనో సినిమాలు చేశాడు.
ఈ కుర్ర హీరోకి టాప్ దర్శకులే కాదు.. కొత్త దర్శకులు సరికొత్త కథలతో మంచి హిట్‌లు ఇచ్చారు. ఈ విషయం కాస్త పక్కన పెడితే.. హీరోయిన్ల విషయంలోనూ నితిన్ జాబితా పెద్దదే. సదా నుంచి రాశీ ఖన్నా వరకు చాలా మంది ముద్దుగుమ్మలు నితిన్ సరసన నటించారు.
ఇప్పుడు ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరో మరో కొత్త కాంబినేషన్‌లో ప్రేక్షకులను అలరించనున్నట్టు సమాచారం. స్వామి రారా, దోచెయ్, కేశవ, రణరంగం సినిమాల దర్శకుడు సుధీర్ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివరలో ఆ సినిమా ఉండనుంది. చంద్రశేఖర్ యేలేటితోనూ నితిన్ ఓ సినిమా చేయనున్నాడని టాక్. ఆ తర్వాత ‘ఛల్ మోహన రంగ’ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలోనూ ఓ మాస్ మూవీ చేస్తాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వీటిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
నితిన్ ప్రస్తుతం ‘భీష్మ’ చేస్తున్నాడు. డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. విడుదలకు సిద్ధమవుతున్న ఈసినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఎంత వరకు ఆకట్టుకుంటాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments