నితిన్, త్రివిక్ర‌మ్ ల స్పెష‌ల్ గిఫ్ట్ రెడీ..

  • IndiaGlitz, [Thursday,December 31 2015]

యంగ్ హీరో నితిన్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం అ..ఆ. అన‌సూయ రామ‌లింగం వెర్షెస్ ఆనంద విహారి అనేది సినిమా ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న స‌మంత‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాథాక్రిష్ణ నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ లో ప్రారంభ‌మైన ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇదిలా ఉంటే...న్యూయ‌ర్ స్పెష‌ల్ గా అ..ఆ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్నారు. ఈరోజు సాయంత్రం అ..ఆ ఫ‌స్ట్ లుక్ & లోగో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుథ్ టాలీవుడ్ కి ప‌రిచ‌యం అవుతున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న అ..ఆ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు