నితిన్ న్యూమూవీ ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో నితిన్..త్రివిక్రమ్ దర్శకత్వంలో అ..ఆ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాక్రిష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం తర్వాత నితిన్..బండ్ల గణేష్ బ్యానర్ లో ఓ మూవీ చేయనున్నట్టు సమాచారం. టెంపర్ తర్వాత బండ్ల గణేష్ మరో సినిమా చేయలేదు. నితిన్ తో సినిమా నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్రివిక్రమ్ సినిమా తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. అయితే ఈ మూవీకి డైరెక్టర్ ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com