జూన్‌లో నితిన్ సినిమా
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్ ఎందుకనో చాలా రోజులుగా సినిమాలు చేయడం లేదు. చాలా గ్యాపే తీసుకున్నాడు. యువ కథానాయకుడు నితిన్ తదుపరి చిత్రం 'భీష్మ'. టైటిల్ అనౌన్స్ చేశారు. రేపో, మాపో ఈ సినిమాను స్టార్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి కానీ.. సినిమా షూటింగ్ స్టార్టే కాలేదు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం జూన్ నుండి ప్రారంభం కానుంది. 'సింగిల్ ఫర్ ఎవర్' అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ సినిమాలో నితిన్ జతగా రష్మిక మందన్నా నటిస్తుంది. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటు నితిన్ చంద్రశేఖర్ యెలేటి, కృష్ణ చైతన్య దర్శకత్వంలో కూడా సినిమాలు చేయబోతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments