మెగా ఫ్యామిలీతో నితిన్ అత్తగారికి రిలేషన్!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’లో ఒకడైన కుర్ర హీరో నితిన్ మరికొన్ని రోజుల్లో ఓ ఇంటివాడు అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నితిన్-శాలినీల నిశ్చితార్థం కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను హీరో నితిన్ ట్వీట్టర్ ద్వారా అభిమానులు, సినీ ప్రియులతో పంచుకున్నాడు. ‘మా ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయ్.. మీ ఆశీర్వాదం కావాలి’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. కాగా.. అసలు నితిన్ కాబోయే అత్తగారెవరు..? వారి బ్యాగ్రౌండ్ ఏంటి..? నితిన్ మామగారు ఏం చేస్తుంటారు..? అనే విషయాలను ఆరా తీసే పనిలో అభిమానులు, నెటిజన్లు పడ్డారు. ఈ క్రమంలో షాలిని కుటుంబం గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది.
రిలేషన్ ఎలాగంటే..!
నితిన్‌కు కాబోయే భార్య షాలిని ఫ్యామిలీకి.. మెగా ఫ్యామిలీకి మంచి రిలేషన్ ఉంది. అదెలాగంటే.. నితిన్ భార్య అమ్మ డాక్టర్ నూర్జహాన్ (కాబోయే అత్త) 2008లో చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలో చేరి కీలక నేతగా ఉన్నారు. అనంతరం 2009 సార్వత్రిక ఎన్నికల్లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన నాగం జనార్ధన్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికి పరిమితంగా కాగా.. ఆ తర్వాత స్థానంలో బీజేపీ ఉండగా..డాక్టర్ నూర్జహాన్ నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు. ఆమెకు కేవలం 3975 అనగా 2.7% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఘోరంగా పరాజయం పాలవ్వడంతో ఆ తర్వాత నుంచి ఆమె రాజకీయాలకు టాటా చెప్పేశారు.
మామయ్య ఏం చేస్తుంటారు!?
నితిన్ భార్య కుటుంబం బాగా ఆస్తులు వెనకేసిన కుటుంబమే..!. నితిన్ మామగారు సంపత్‌కు మహబూబ్‌నగర్ వ్యాప్తంగా ఆస్పత్రులు చాలానే ఉన్నాయి. అలా జిల్లా వ్యాప్తంగానే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు.. డాక్టర్ నూర్జహాన్‌కు మంచి గుర్తింపు ఉంది. అలా ప్రజలకు బాగా దగ్గరైన ఆ కుటుంబం రాజకీయాల్లోకి దిగి ప్రజాసేవ చేయాలనుకుని.. మెగా ఫ్యామిలీతో ఉన్న పరిచయాలతో రంగంలోకి దిగారు. అయితే తొలిసారే ఆశలన్నీ ఆవిరవ్వడంతో ఇక చేసేదేమీ లేక రాజకీయాలకు దూరమైపోయారు. అనంతరం యథావిధిగా తమ ఆస్పత్రులను చూసుకుంటూ ఉండిపోయిందీ కుటుంబం. అలా నాటి నుంచి నేటి వరకూ మెగా ఫ్యామిలీతో.. నూర్జాహాన్ మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి.
మెగా ఫ్యామిలీతో నితిన్‌కు కూడా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు నితిన్ భక్తుడు అనే విషయం తెలిసిందే..! నితిన్‌కు సంబంధించిన సినిమాల ఈవెంట్స్‌కు వెళ్లడం.. అప్పుడప్పుడూ నితినే వెళ్లి పవన్‌ను కలవడం జరుగుతుంటుంది. అలా మెగా ఫ్యామిలీతో.. నితిన్ ఫ్యామిలీకి కూడా మంచి సంబంధాలున్నాయ్. అంతేకాదు.. నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి సినీ డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా టాలీవుడ్‌కు సుపరిచితులే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments