పెళ్లి వాయిదా...పుట్టినరోజు వేడుకలు వద్దు: నితిన్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించాడు. అలాగే ఈ నెల 30న కూడా పుట్టినరోజు వేడుకలను అభిమానులెవరూ నిర్వహించవద్దని కోరుతూ ఓ లేఖ రాశారు. అది ఎందుకనో అందరికీ తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా దేశమంతటా లాక్ డౌన్ ప్రజలు, సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమైయ్యారు. వేడుకలు, పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలంటూ ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు.
‘‘నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడివున్నాయో మీకు తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని, లాక్‌డౌన్ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టినరోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు జరుపవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అంతే కాదు, లాక్‌డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీ జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనమందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లల్లో మనం కాలు మీద కాలేసుకొని కూర్చొని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లు. ఎల్లవేళలా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్నీ ఆశించే మీ.. నితిన్’’ అంటూ నితిన్ తన లేఖలో పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments